Asia cup 2025 | సూపర్-4లో లంక‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో ఇప్పుడు సూపర్-4 ఫైట్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లా జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్‌లో కట్టుదిట్టంగా ఆడిన బంగ్లా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ పరిపక్వత చూపింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో ఇప్పుడు సూపర్-4 ఫైట్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లా జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్‌లో కట్టుదిట్టంగా ఆడిన బంగ్లా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ పరిపక్వత చూపింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ డసన్ షనక అద్భుతంగా ఆడుతూ 37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కుశాల్ మెండిస్ (34), పాతుమ్ నిస్సంక (22) తోడయ్యారు.

Asia cup 2025 | శ్రీలంకకు షాక్..

బంగ్లా (Bangladesh) బౌల‌ర్స్​లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3/20తో రాణించ‌గా, మెహ్‌దీ హసన్ 2/25, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ సైఫ్ హసన్ (61), టౌహిడ్ హృదయ్ (58) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరి హాఫ్ సెంచరీలే విజయం బాట పట్టించాయి. అవసరమైన సమయంలో స్ట్రైక్ రొటేషన్, బౌండరీలు బాద‌డంతో బంగ్లా జ‌ట్టు సులువుగా గెలిచింది. బంగ్లాదేశ్‌ గెలవడానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా, జాకెర్ అలీ బౌండరీ కొట్టి స్కోరు సమం చేశాడు. కానీ వెంటనే బౌల్డ్ అయ్యాడు. మెహ్‌దీ హసన్ కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరికి షమీమ్ హొస్సేన్ (1 నాటౌట్‌) ఒక సింగిల్ తీయడంతో బంగ్లా విజయం సాధించింది.

శ్రీలంక Srilanka బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. వానిందు హసరంగా 2/22, డసన్ షనక 2/21, నువాన్ తుషారా 1 వికెట్, దుష్మంత చమీరా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్-4 దశను విజయవంతంగా ప్రారంభించింది. టోర్నీలో నెక్స్ట్ మ్యాచ్‌లకు ఇది మరింత ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. మరొకవైపు, శ్రీలంక తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు భారత్​ – పాకిస్తాన్​ మ‌ధ్య సూప‌ర్ ఫోర్‌లో తొలి ఫైట్ జ‌ర‌గ‌నుంది. మ‌రి ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తార‌నేది చూడాల్సి ఉంది.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...