అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | ఇందూరు అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) ఆధ్వర్యంలో కనుల పండువగా అయ్యప్ప పడిపూజ (Ayyappa Padi Puja) కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో (Vinayak Nagar) ఉన్న డీఎస్ఎన్ హోంలో ఆదివారం ఎమ్మెల్యే ధన్పాల్ సకుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నారు. పూజ కోసం ఏర్పాటుచేసిన సెట్టింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారులతో పాటు సామాన్య భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడంతో ప్రాంగణం కిక్కిరిసింది.
మహా పడిపూజలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మల్లారం ఆశ్రమం పీఠాధిపతులు పిట్ల కృష్ణ మహారాజ్, గుండయ్య స్వామి, గజవాడ ఆగమయ్య స్వామి, మంచాల జ్ఞానేంద్ర, ధన్పాల్ వంశీకృష్ణ స్వామి, ధన్పాల్ ఉదయ్, ధన్పాల్ ప్రణయ్, ధన్పాల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
