Homeతాజావార్తలుNalla Mallareddy College | అయ్యప్ప భక్తుల ఆందోళన.. నల్ల మల్లారెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత

Nalla Mallareddy College | అయ్యప్ప భక్తుల ఆందోళన.. నల్ల మల్లారెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత

నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalla Mallareddy College | మేడ్చల్ జిల్లా (Medchal District) మేడిపల్లి పీఎస్ (Medipalli PS) పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

అయ్యప్ప మాల వేసుకున్న ఓ విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తుల ఆందోళన చేపట్టారు. మాల వేసుకుని కాలేజీకి వచ్చిన స్టూడెంట్​తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. ఈ ఘటనపై ఏబీవీపీ (ABVP), బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Nalla Mallareddy College | అసలు ఏం జరిగిందంటే..

కాలేజీలో ఇంజినీరింగ్​ ఫస్టియర్​ చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల (Ayyappa Maala) వేసుకున్నాడు. దీక్ష దుస్తులతోనే కాలేజీకి హాజరయ్యాడు. అయితే నల్ల దుస్తులు వేసుకుంటే కాలేజీలోకి అనుమతించమని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పింది. విద్యార్థితో బలవంతంగా మాల దుస్తులు తీయించి అధ్యాపకులు యూనిఫామ్ వేయించారు. ఈ మేరకు ఆ యువకుడు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఇది వైరల్​ కావడంతో అయ్యప్ప స్వాములతో పాటు ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.

Must Read
Related News