Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

Yellareddy | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవాపథకం, జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఎయిడ్స్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) జాతీయ సేవాపథకం, జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఎయిడ్స్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న ప్రజలకు ఎయిడ్స్​పై అవగాహన కల్పించే బాధ్యత నేటి విద్యార్థులదేనన్నారు.

ఈ కార్యక్రమంలో సైన్స్ విభాగం అధిపతి డా.బుద్దె అరుణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు, ఎన్ఎస్ఎస్ యూనిట్ కార్యక్రమ అధికారులు చంద్రకాంత్, రాణి, అధ్యాపకులు గంగారెడ్డి, సిద్దురాజు, కృష్ణ ప్రసాద్, గోదావరి, శశిధర్, రాజు, సంతోష్, సురేష్ రెడ్డి, సంగీత, కీర్తి స్వప్న, కిరణ్ కుమార్, మొయిన్, మహమూద్, వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News