Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

Nizamabad City | బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బేటీ బచావ్​ – బేటీ పడావ్​ కార్యక్రమంలో అవేర్​నెస్​ ప్రోగాం ఏర్పాటు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బేటీ బచావ్​ – బేటీ పడావ్​ (Beti Bachao – Beti Padao) కార్యక్రమంలో అవేర్​నెస్​ ప్రోగాం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ హబ్ ఎంపవర్ మెంట్ అఫ్ వుమెన్ ప్రతినిధులు కవిత, సౌమ్య మాట్లాడుతూ బాలికలకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీని తప్పుగా వాడుకుంటే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాలికలు ఏవైనా ఇబ్బందులు ఎదురయితే వెంటనే 1098 నంబరును సంప్రదించాలని సూచించారు. అనంతరం సఖి కేంద్రం ప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సఖి సెంటర్​ ప్రతినిధి స్వరూప, పాఠశాల హెచ్​ఎం శంకర్​, టీచర్లు శ్రీకాంత్, కరుణ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News