అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Avatar: Fire and Ash | లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (Director James Cameron) తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ అవతార్: ఫైర్ అండ్ యాష్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 19, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, పాండోరా ప్రపంచాన్ని మరింత కొత్త కోణంలో చూపిస్తూ అభిమానులను మరోసారి థియేటర్లకు రప్పించింది.
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ కారణంగా సినిమా థియేటర్లలో దీర్ఘకాలం కొనసాగింది. ప్రస్తుతం దాని థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఓటీటీ విడుదలపైనే ఉంది. ముఖ్యంగా భారతీయ అభిమానులు అవతార్ 3 ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందా? ఏ ప్లాట్‌ఫారమ్‌లో చూడొచ్చా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Avatar: Fire and Ash | వెయిటింగ్..
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం భారత్‌లో జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, కథ పరంగా ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించిన విషయం తెలిసిందే. గత అనుభవాన్ని బట్టి చూస్తే, అవతార్: ది వే ఆఫ్ వాటర్ థియేటర్లలో విడుదలైన సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అదే విధంగా ఫైర్ అండ్ యాష్ కూడా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో జాక్ సులీ, నెయితిరి తమ కుటుంబంతో కలిసి పాండోరాలో కొత్తగా పరిచయమైన అగ్ని స్వభావం కలిగిన నావి తెగ ‘యాష్ పీపుల్’ను (Ash People) ఎదుర్కొంటారు. మానవుల ఆక్రమణ, ప్రకృతి సంరక్షణ, కుటుంబ బంధాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ కీలక పాత్రల్లో నటించగా, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, ఉనా చాప్లిన్ వంటి నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాక్సాఫీస్ పరంగా చూస్తే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి ‘అవతార్’ బ్రాండ్ బలాన్ని నిరూపించింది. ఇదిలా ఉండగా, జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో తదుపరి భాగాలైన అవతార్ 4, అవతార్ 5లను అధికారికంగా ప్రకటించారు. అవి వరుసగా 2029, 2031లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.