అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallareddy mandal | ఆత్మకథలు యువతకు దిశా నిర్దేశం చేస్తాయని రేరా ఛైర్మన్ సత్యనారాయణ (RERA Chairman Satyanarayana) పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఇలాంటి కథలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.
Yeallareddy mandal | ఎల్లారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో..
డాక్టర్ శంకర్ రాసిన ‘కుంచె గీచిన బతుకు చిత్రం’ (Kuncha Gechina Batuku Chitram) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేరా ఛైర్మన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ డాక్టర్ శంకర్ తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం పుస్తకాన్ని పరిచయం చేసిన డాక్టర్ నాలేశ్వర్ శంకర్ మాట్లాడుతూ.. ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ అనే పేరులోనే ఒక కళాత్మకత ఉందన్నారు.
Yeallareddy mandal | సాధారణ స్థాయి నుంచి..
ఒక చిత్రకారుడు తన జీవితాన్ని రంగులతో కాకుండా అక్షరాలతో ఎలా తీర్చిదిద్దారో ఈ శీర్షిక మనకు సూచిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ శంకర్ ఒక సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో అష్టకష్టాలు ప్రతికూలతలు ఎదుర్కొన్నారని ఆ విషయాలన్నీ పుస్తక రూపంలో చేర్చి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా రాశారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, కళాశాల తెలుగు విభాగ అధ్యక్షులు పి. విశ్వ ప్రసాద్, రవీంద్ర నాథ్, ఉమా మహేశ్వరి, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఎ. సుధాకర్, జి. శ్రీనివాసరావు, కవులు సూరారం శంకర్, సిరిగాద శంకర్, ఉస్మాన్, స్నేహ తదితరులు పాల్గొన్నారు.