5
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన బాన్సువాడ (Banswada) శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద (Bichkunda) నుంచి బాన్సువాడ వైపు వస్తున్న ఆటో తాడ్కోల్ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో దాదాపు పది మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులతో పాటు ఆటోపై ఇనుప సామాగ్రి తరలిస్తుండడంతో అధిక లోడు వల్ల ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) తరలించారు. మిగతా ప్రయాణికులకు కూడా గాయాలవగా.. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.