అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బోర్గాం(పి)లోని (Borgaon(P)) సంజీవరెడ్డి కాలనీలో (Sanjeev reddy Colony) మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నుంచి ఆటో నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా.. మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నాలుగో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.