అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Mandal | రోడ్డు ప్రమాదం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ (Ankapur) గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Armoor Mandal | ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఆటో..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుంచి జానకంపేట్‌కు సుమారు ఆరుగురు వ్యక్తులతో ఆటో వెళ్తోంది. అలాగే నిజామాబాద్ (Nizamabad) నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆర్మూర్‌కు సాయిప్రసాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంకాపూర్ వద్ద ఆటో, బైక్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జానంకపేట్ గ్రామానికి చెందిన సంధ్యారాణి, బైక్‌పై ప్రయాణిస్తున్న సాయికిరణ్ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు.
Armoor Mandal | ఆర్మూర్ ఆస్పత్రికి క్షతగాత్రులు..
ఆటోలో ప్రయాణిస్తున్న మిగితా ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా.. వారిని ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)కి తరలిచారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఆర్మూర్ పోలీసులు (Armoor Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.