Homeజిల్లాలునిజామాబాద్​Giriraj college | సీజేఐపై దాడికి యత్నించడం హేయమైన చర్య

Giriraj college | సీజేఐపై దాడికి యత్నించడం హేయమైన చర్య

జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడికి యత్నించడం తీవ్రమైన చర్య అని ప్రిన్సిపాల్​ రామ్మోహన్​ రావు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Giriraj college | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్​పై (Chief Justice BR Gavai) దాడికి యత్నించడం హేయమైన చర్య అని గిరిరాజ్​ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కళాశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నత హోదాలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాడికి యత్నించడం అంటే రాజ్యాంగానికి మాయని మచ్చగా భావించవచ్చన్నారు.

ఇలాంటి దాడులను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పౌర సమాజం నిరసనల ద్వారా చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, పీఆర్వో దండు స్వామి, భరత్ రాజ్, రాజేష్, నహీదా బేగం, రంజిత, వినయ్ కుమార్, రామస్వామి, రాహుల్, రామకృష్ణ, బాలామణి, వెంకటేష్ గౌడ్, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News