అక్షరటుడే, కామారెడ్డి: Machareddy | మద్యంమత్తులో ఓ వ్యక్తి దుస్తుల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ సేల్స్‌మెన్ తనకు దుస్తులు సరిగా చూపించడం లేదంటూ లారీతో షాప్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మాచారెడ్డి (Machareddy) గజ్యా నాయక్ తండాలో బుధవారం చోటు చేసుకుంది.
Machareddy | వివరాల్లోకి వెళ్తే..
గజ్యా నాయక్ తండాకు (Gajya Naik Thanda) చెందిన చంద్రు నాయక్ దుస్తుల దుకాణానికి మధు అనే వ్యక్తి మద్యం మత్తులో వెళ్లాడు. యజమాని కుమారుడితో అసభ్యకరంగా మాట్లాడుతూ గొడవకు దిగాడు. విషయం తెలుసుకున్న సమీపంలోని ఇతర దుకాణదారులు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు.
అయితే మద్యం మత్తులో ఉన్న మధు తనకు దుకాణంలో దుస్తులు సరిగ్గా చూపించలేదనే కోపంతో లారీని తీసుకొచ్చి దుస్తుల దుకాణాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న మాచారెడ్డి ఎస్సై అనిల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మధును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.