అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హెట్‌లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి దుండగులు నిప్పు అంటించారు.
బంగ్లాలో కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హిందువులను హత్య చేశారు. మైమెన్ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో (Chittagong) హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పు అంటించారు. ఆ కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడింది. నిత్యం దాడులు జరుగుతుండడంతో ఆ దేశంలోని హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Bangladesh | చర్యలు కరువు
బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొన్ని రోజులుగా దాడులు జరుగుతున్న అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డిసెంబర్ 28న పిరోజ్‌పూర్ జిల్లాలోని (Firozpur District) దుమ్రితల గ్రామంలో (Dumritala Village) ఒక ఇంటికి నిప్పంటించారు. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలపై 29 ఏళ్ల కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను ఒక గుంపు కొట్టి చంపి, అతని మృతదేహాన్ని తగలబెట్టింది. ఇటువంటి మతతత్వ సంఘటనలపై గట్టి చర్య తీసుకోవాలని భారత్ బంగ్లాదేశ్‌ను కోరింది. వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ విభేదాలు లేదా ఇతర అదనపు కారణాలతో ఇటువంటి హింసను ఆపాదించే బంగ్లాదేశ్ ధోరణిని న్యూఢిల్లీ (New Delhi) విమర్శించింది.