Forest Department | అటవీశాఖ సిబ్బందిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

అక్షరటుడే ఇందల్వాయి: Forest Department | అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకువ వెళ్లిన ఫారెస్ట్​ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీరేంజ్ (Indalwai Forest Range)​ పరిధిలోని కొట్టాలపల్లి బీట్ కంపార్ట్​మెంట్​ 593లో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు. భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్​ను పట్టుకునేందుకు […]

అక్షరటుడే ఇందల్వాయి: Forest Department | అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకువ వెళ్లిన ఫారెస్ట్​ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీరేంజ్ (Indalwai Forest Range)​ పరిధిలోని కొట్టాలపల్లి బీట్ కంపార్ట్​మెంట్​ 593లో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు.

భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్​ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తండావాసి భూక్యా నవీన్, మరికొందరు కలిసి అటవీ అధికారులపై కారం చల్లారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ అధికారులు ప్రవీణ్, రాములు, ఖదీర్, బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్పల్లి పోలీసులు (Dharpally Police station) ట్రాక్టర్​ను సీజ్​ చేసి దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్​ఆర్​వో రవిమోహన్​ భట్​ పేర్కొన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసులు సీజ్​ చేసిన ట్రాక్టర్​

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...