Homeక్రైంHyderabad | హైదరాబాద్ బాలసదన్​లో​ దారుణం.. బాలురపై లైంగికదాడికి పాల్పడ్డ స్టాఫ్​గార్డు

Hyderabad | హైదరాబాద్ బాలసదన్​లో​ దారుణం.. బాలురపై లైంగికదాడికి పాల్పడ్డ స్టాఫ్​గార్డు

హైదరాబాద్​ నగరంలోని సైదాబాద్​ జువైనల్​ హోమ్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలురకు రక్షణగా ఉండాల్సిన పర్యవేక్షణాధికారి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాలురకు రక్షణగా ఉండాల్సిన ఓ వ్యక్తిపై వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నగరంలోని సైదాబాద్​ బాలసదన్​లో (Saidabad Balasadhan) ఆరుగురు బాలురపై స్టాఫ్​గార్డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

జువైనల్​ హోమ్​లో ఉండే ఓ బాలుడు దసరా పండుగకు (Dussehra festival) ఇంటికి వెళ్లాడు. అయితే పండుగ అయిపోయిన తర్వాత సదన్​కు వెళ్లడానికి నిరాకరించాడు. తాను అక్కడకు వెళ్లనని ఏడ్చాడు. దీంతో తల్లిదండ్రులు వివరాలు ఆరా తీయగా.. అక్కడ జరిగిన ఘోరాలను ఆ బాలుడు వివరించాడు. జువెనైల్ హోం (juvenile home) సంరక్షుకుడు తరచూ లైంగికదాడికి పాల్పడుతున్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad | వెలుగులోకి సంచలన విషయాలు

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు (investigation) చేపట్టారు. మొదట ఒక బాలుడిపైనే లైంగిక దాడి జరిగిందని భావించారు. అయితే విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆరుగురు బాలురపై స్టాఫ్​గార్డు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. హోమ్‌లో చిన్నారులను కంటికి రెప్పగా కాపాడాల్సిన స్టాఫ్‌గార్డు మృగంగా మారిపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. హోమ్​లోని బాలురకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.