అక్షరటుడే, వెబ్‌డెస్క్: Daughter-in-law : అక్కాచెల్లెళ్లలైన అత్తలను ఓ కోడలు తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. అంతటితో ఆగకుండా సలసలా కాగే వేడి నీటిని ముఖంపై పోసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో చోటుచేసుకుంది.
గొందిగూడెంలో సతీష్, నవీన అనే దంపతులు ఉంటున్నారు. వీరి వద్దనే సతీష్ తల్లి ఈశ్వరి, ఆమె సోదరి ఊర్మిళ ఉంటున్నారు. కాగా, గత కొంతకాలంగా కోడలు నవీన ఇద్దరు అత్తలను వేధిస్తోంది. దీనికి కొడుకు సతీష్ అడ్డుచెప్పకుండా.. భార్యకే వంత పాడేవాడు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అత్త ఈశ్వరీని కోడలు నవీన చిత్రహింసలకు గురిచేసింది. పొయ్యిలో ఉన్న కట్టెతో అత్తను కాల్చే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే ఈశ్వరి సోదరి ఊర్మిళ అడ్డుకుంది. ఆగ్రహించిన నవీన, ఊర్మిళ తలపై బలంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పొయ్యి మీద ఉన్న సలసలా కాగుతున్న వేడి నీటిని ఊర్మిళపై పోసింది.
ఊర్మిళ శరీరంపై వేడి నీరు పోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. అత్త ఈశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు కొడుకు సతీష్, కోడలు నవీనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.