Karimnagar-Tirupati Express train | తిరుపతి ప్రయాణికులకు షాక్​.. జూన్​ నుంచి ఆ రైలు ఉండదు!

అక్షరటుడే, హైదరాబాద్: Karimnagar-Tirupati Express train | తిరుపతికి వారానికి రెండుసార్లు నడిచే కరీంనగర్ ​- తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలు వచ్చే నెల(జూన్)​ నుంచి అందుబాటులో ఉండడం లేదా.. బెర్త్‌ రిజర్వేషన్‌ చేసుకునే వారికి ఈ ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులకు కూడా దీనిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలు రద్దవుతుందా.. అనే సందేహం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి స్టేషన్‌లో ఈ నెల 22 తరువాత హాల్టింగ్‌ కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. […]

అక్షరటుడే, హైదరాబాద్: Karimnagar-Tirupati Express train | తిరుపతికి వారానికి రెండుసార్లు నడిచే కరీంనగర్ ​- తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలు వచ్చే నెల(జూన్)​ నుంచి అందుబాటులో ఉండడం లేదా.. బెర్త్‌ రిజర్వేషన్‌ చేసుకునే వారికి ఈ ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులకు కూడా దీనిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలు రద్దవుతుందా.. అనే సందేహం వ్యక్తమవుతోంది.

పెద్దపల్లి స్టేషన్‌లో ఈ నెల 22 తరువాత హాల్టింగ్‌ కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఐఆర్‌సీటీసీ(IRCTC) సైట్‌లో కూడా ఈ రైలు హాల్టింగ్‌ లిస్టులో పెద్దపల్లి స్టేషన్‌(Peddapalli station)ను కనబడడం లేదు. వచ్చే నెల 1 నుంచి ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్​సైట్​లో కరీంనగర్‌ స్టేషన్‌ సైతం కనిపించదంటున్నారు.

గత కొన్నేళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఈ కరీంనగర్​ – తిరుపతి రైలు ద్వారా వారానికి సుమారు 2,500 మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా.. పెద్దపల్లి దగ్గరలో కాజీపేట – బల్లార్షా ప్రధాన రైలు మార్గం నుంచి పెద్దపల్లి – నిజామాబాద్‌ మార్గానికి అనుసంధానం చేసిన బైపాస్‌ మార్గం నిర్మాణంలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో జరగాల్సిన ట్రయల్‌ రన్‌ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే కరీంనగర్‌ నుంచి వరంగల్, కాజీపేట వైపు వెళ్లే రైళ్లు పెద్దపల్లి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరముండదు. అందుకే కరీంనగర్‌ – తిరుపతి రైలు పెద్దపల్లిలో హాల్టింగ్‌ ఎత్తివేస్తున్నారంటున్నారు.

కరీంనగర్‌ నుంచి నేరుగా తిరుపతికి వెళ్లే రైలు ఇదొక్కటే ఉంది. ఈ తిరుపతి రైలు ద్వారానే గతేడాది కరీంనగర్‌ స్టేషన్‌కు రూ.5,65,22,893 ఆదాయం వచ్చింది. రూ.1,60,714 మంది ప్రయాణించడంతో స్టేషన్‌ స్థాయి ఎన్‌ఎస్‌జీ-5కి ఎగబాకింది. పెద్దపల్లి స్టేషన్‌ ద్వారా సైతం ఏటా ప్రయాణించే 7.73 లక్షల మంది వల్ల రూ.10.69 కోట్లు సమకూరడంతో ఈ స్టేషన్‌ స్థాయి ఎన్‌ఎస్‌జీ-4కి చేరింది.

తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలును నిజామాబాద్‌, బాసర వరకు పొడిగించడం గానీ, వారానికి మరో రెండుసార్లు రాకపోకలు కొనసాగించడం చేస్తే ఈ రెండు స్టేషన్ల ఆదాయం మరింత పెరగనుంది. దీనిపై స్థానిక ఎంపీలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...