Uttar Pradesh | రూ.31 లక్షల వరకట్నం తిరిగిచ్చేసిన వరుడు.. కేవలం రూపాయి కట్నంతో పెళ్లి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh | వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న నేటి కాలంలోనూ ఓ యువకుడు విశాల హృదయం చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల కట్నం తిరిగి వారికే ఇచ్చేశాడు. వరుడి సూచన మేరకు రూ. ఒక రూపాయి, ఒక కొబ్బరి కాయతో మొత్తం పెళ్లి క్రతువును పూర్తి చేశారు. ఈ ఆదర్శ వివాహం హరియాణాలోని కురుక్షేత్రలో జరిగింది. ఉత్తర్​ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా భాబ్సి రాయ్‌పూర్​కు చెందిన శ్రీపాల్ రాణా […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh | వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న నేటి కాలంలోనూ ఓ యువకుడు విశాల హృదయం చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల కట్నం తిరిగి వారికే ఇచ్చేశాడు. వరుడి సూచన మేరకు రూ. ఒక రూపాయి, ఒక కొబ్బరి కాయతో మొత్తం పెళ్లి క్రతువును పూర్తి చేశారు. ఈ ఆదర్శ వివాహం హరియాణాలోని కురుక్షేత్రలో జరిగింది.

ఉత్తర్​ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా భాబ్సి రాయ్‌పూర్​కు చెందిన శ్రీపాల్ రాణా కుమారుడు వికాస్ రాణా న్యాయవాది. అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు. తండ్రి శ్రీపాల్ బీఎస్పీ తరఫున యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు.

కాగా, వికాస్ రాణాకు హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో వివాహం కుదిరింది. పెళ్లి రోజు(ఏప్రిల్ 30) వికాస్ రాణా కుటుంబం ఊరేగింపుగా హరియాణాలోని కురుక్షేత్రకు చేరుకుంది. నగరంలోని ఓ హోటల్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు.

తిలకం వేడుక జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు, పెళ్లికొడుకుకు వరకట్నంగా రూ.31 లక్షల నగదు ముట్టజెప్పారు. కానీ, వరుడు వికాస్ ఆ డబ్బు తీసుకోలేదు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం సామాజిక దురాచారం అంటూ నిరాకరించాడు. తమకు వధువే ఒక కట్నం అంటూ వికాస్ రాణా చెప్పుకొచ్చారు.

అలా అతని కోరిక మేరకు వికాస్ రాణా, అగ్రికా తన్వర్‌‌ల పెళ్లి తంతును ఒక రూపాయి నాణెం, ఒక కొబ్బరికాయతో జరిపించారు. కట్నం తీసుకోకుండా సమాజానికి, ఈతరం యువతకు వికాస్ రాణా గొప్ప సందేశం ఇచ్చారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...