Sunitha Williams | 27 ఏళ్ల నాసా సేవలకు వీడ్కోలు.. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్‌మెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunitha Williams | భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో సేవలందించిన సునీతా, నాసా (NASA) నుంచి పదవీ విరమణ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ నిర్ణయం గత ఏడాది డిసెంబర్ 25 నుంచే అమల్లోకి వచ్చిందని నాసా స్పష్టం చేసింది. అంతరిక్ష పరిశోధనల రంగంలో ఆమె చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunitha Williams | భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో సేవలందించిన సునీతా, నాసా (NASA) నుంచి పదవీ విరమణ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ నిర్ణయం గత ఏడాది డిసెంబర్ 25 నుంచే అమల్లోకి వచ్చిందని నాసా స్పష్టం చేసింది. అంతరిక్ష పరిశోధనల రంగంలో ఆమె చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులు ఘనంగా కొనియాడుతున్నారు.

ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ సునీతా విలియమ్స్‌ను ప్రశంసిస్తూ,“మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ ఒక నిజమైన మార్గదర్శకురాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (Space Station)లో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన సేవలు భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై జరగబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయి”అని వ్యాఖ్యానించారు.

 Sunitha Williams | 1998 నుంచి 2025 వరకు..

సునీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో మూడు అంతరిక్ష మిషన్లలో పాల్గొని, మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఈ ఘనతతో అత్యధిక రోజులు స్పేస్‌లో గడిపిన అమెరికన్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఇటీవల బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌ (Boeing Starliner Mission)లో భాగంగా వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి 286 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండటం విశేషంగా నిలిచింది. అంతేకాకుండా ఆమె మొత్తం 9 సార్లు స్పేస్ వాక్‌లు చేసి, 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వెలుపల గడిపారు. ఇది మహిళా వ్యోమగాముల్లో అత్యధికం కావడం మరో రికార్డు.

అంతరిక్షంలోనే మారథాన్ పూర్తి చేసిన ప్రపంచంలో తొలి వ్యక్తిగానూ సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు.

సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణాలు

* 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ (STS-116) ద్వారా తొలి అంతరిక్ష ప్రయాణం. ఎక్స్‌పిడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజినీర్‌గా సేవలు. నాలుగు స్పేస్ వాక్‌లు నిర్వహణ

* 2012 జూలై 14న కజకిస్తాన్‌లోని బయ్‌కోనూర్ నుంచి రెండోసారి ప్రయాణం.  127 రోజుల పాటు ఎక్స్‌పిడిషన్ 32/33లో కీలక బాధ్యతలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమ్మోనియా లీక్ మరమ్మతులు సహా పలు సాంకేతిక పనులు

* 2024 జూన్​లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా మూడోసారి అంతరిక్ష యాత్ర. ఎక్స్‌పిడిషన్ 71/72లో భాగంగా 286 రోజులు ISSలో గడిపారు. 2025 మార్చిలో భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. భారత సంతతికి చెందిన వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అంతరిక్షంలో భారతీయ సంస్కృతి, యోగాపై ఆమె చూపిన ఆసక్తి, శాస్త్రీయ ప్రతిభ అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...