అక్షరటుడే, కామారెడ్డి: Acb Trap | కామారెడ్డి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Assistant Public Prosecutor) ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపింది. కోర్టు కానిస్టేబుల్ (Court Constable) ద్వారా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ (ACB DSP Shekhar Goud) తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో (Kamareddy Police Station) 2018లో నమోదైన చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసును త్వరగా ముగించడానికి ఏపీపీ గుగ్లోత్ అశోక్ శివరాం (APP Gugloth Ashok Shivaram Nayak ) బాధితునికి రూ.15వేల లంచం డిమాండ్ చేశాడు. చివరికి రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు.
పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా శుక్రవారం బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు ఐదు గంటలుగా కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీపీ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం ఏపీపీ, కోర్టు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అయితే కానిస్టేబుల్ సంజయ్ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీ అశోక్ శివరాం నాయక్ సైతం జడ్జి పోస్టు కోసం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.