Nizamabad | దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంత లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై భార్య దుర్మరణం

అక్షరటుడే, ఇందూరు: Nizamabad | దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఏఎస్సై భార్య దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లో చోటుచేసుకుంది. నగరంలో నివాసం ఉండే ఇంటెలిజెన్స్ (Intelligence)​ ఏఎస్సై(ASI) భీమ్​రావు సతీమణి మాక్లూర్​ భవాని(58) బుధవారం (జూన్​ 9) ఉదయం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాసర(BASARA)కు వెళ్లారు. Nizamabad | కుక్క అడ్డు రావడంతో.. అమ్మవారి దర్శనం అనంతరం తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar bypass)​ […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad | దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఏఎస్సై భార్య దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లో చోటుచేసుకుంది. నగరంలో నివాసం ఉండే ఇంటెలిజెన్స్ (Intelligence)​ ఏఎస్సై(ASI) భీమ్​రావు సతీమణి మాక్లూర్​ భవాని(58) బుధవారం (జూన్​ 9) ఉదయం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాసర(BASARA)కు వెళ్లారు.

Nizamabad | కుక్క అడ్డు రావడంతో..

అమ్మవారి దర్శనం అనంతరం తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar bypass)​ మీద వస్తుండగా వీరి వాహనానికి ఒక కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో భవాని కుమారుడు సడెన్​గా బ్రేక్​ వేశాడు. ఈ క్రమంలో వాహనంలో కొంగు చిక్కుకోవడంతో భవాని అదుపు తప్పి కింద పడిపోయారు. కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

రూరల్​ పోలీసులు (RUral Police) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్​ ఏఎస్సై భీమ్​రావు భార్య భవాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భీమ్​రావుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భీమ్​రావు సొంత గ్రామం. మాక్లూరు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు అమెరికా(AMERICA)లో ఉంటున్నాడు. కాగా, పెద్దబాబు వచ్చాకనే సొంతూరు మాక్లూర్(Makloor)​లో శుక్రవారం భవాని అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...