అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భగలాముఖి అమ్మవారి (Bhagalamukhi Ammavari) మాస జన్మదిన అష్టమిని శుక్రవారం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) భగలాముఖి అమ్మవారికి విశేష పూజలు చేశారు. గణపతి పూజతో పాటు గోత్రనామాలతో విశేష సంకల్పం నిర్వహించారు.
అమ్మవారి విగ్రహానికి శుద్ధోదక జలాభిషేకం, ఆవుపాలతో క్షీరాభిషేకం, పంచామృతాలతో పంచామృతాభిషేకం, పసుపుతో హరిద్రాభిషేకం, కొబ్బరి నీళ్లతో నారీకేల జలాభిషేకాలు చేశారు. అలాగే భక్తులు దేవీ దేవతల నామ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన పట్టు వస్త్ర సమర్పణతో పాటు వివిధ రకాల ఫలాలు, స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో పీఠాధిపతి క్రాంతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
