అక్షరటుడే, వెబ్‌డెస్క్: As soon as you wake up | పెద్దలు తరచుగా చెబుతుంటారు.. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశామో ఏంటో.. ఈ రోజు అంతా ఇలా జరుగుతోంది అని. ఇది కేవలం మాట మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. మనం నిద్రలేచిన మొదటి అరగంట సమయం మన మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది.
ఆ సమయంలో మనం చూసే దృశ్యాలు, వినే మాటలు మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, మన రోజు ఎలా గడవాలి అనేది మనం ఉదయం చూసే మొదటి వస్తువుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఉదయాన్నే ప్రతికూల శక్తులను కలిగించే ఈ కింది వస్తువులకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ Smartphone, Computer Screen: As soon as you wake up | చాలామందికి కళ్లు తెరవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ, ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. నిద్రలేవగానే వచ్చే నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆఫీస్ ఈమెయిల్‌లు మెదడును ఒత్తిడికి గురిచేస్తాయి. ఇది సహజమైన ఆలోచనా శక్తిని తగ్గించి, రోజంతా మిమ్మల్ని టెన్షన్‌లో ఉంచుతుంది. కాబట్టి కనీసం అరగంట పాటు స్క్రీన్‌లకు దూరంగా ఉండటం మంచిది.
ఖాళీ పాత్రలు: As soon as you wake up | ఉదయాన్నే ఖాళీగా ఉన్న పాత్రలు, కుండలు, ప్లేట్లను చూడటం దారిద్య్రానికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా కిచెన్ సింక్ నిండా ఉన్న ఎంగిలి గిన్నెలను చూడటం వల్ల మనసు చికాకుగా మారుతుంది. అందుకే ముందు రోజు రాత్రే వాటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
అస్తవ్యస్తమైన వాతావరణం: As soon as you wake up | గది నిండా చెత్త, చిందరవందరగా ఉన్న దుస్తులు మన వైబ్రేషన్లను తగ్గిస్తాయి. గజిబిజిగా ఉన్న వాతావరణం మన ఆలోచనలను కూడా అస్తవ్యస్తం చేస్తుంది. నిద్రలేవగానే ప్రశాంతమైన, శుభ్రమైన వాతావరణాన్ని చూడటం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు.
ప్రతికూల వ్యక్తులు, వార్తలు: As soon as you wake up | ఉదయాన్నే గొడవపడే వ్యక్తులను, నెగటివ్ వార్తలను చూడటం వల్ల మీలోని సానుకూల శక్తి తగ్గిపోతుంది. ఇది మీ మానసిక స్థితిని నిరుత్సాహపరుస్తుంది. అలాగే పూర్వీకుల ఫొటోలను గౌరవించడం మంచిదే అయినా, నిద్రలేవగానే వాటిని చూడటం వల్ల గతంలోకి, బాధలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముందుగా దైవ దర్శనం, పూజ చేశాకే వారిని స్మరించుకోవాలి.
జంతువుల పోరాటాలు: As soon as you wake up | సోషల్ మీడియాలో గానీ, ప్రత్యక్షంగా గానీ జంతువుల కొట్లాటలు, క్రూర జంతువుల దృశ్యాలను చూడటం అశుభంగా పరిగణిస్తారు. ఇది తెలియకుండానే మనలో ఆందోళనను, వింత భయాన్ని కలిగిస్తుంది.
నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం (కరాగ్రే వసతే లక్ష్మి..), ఇష్ట దైవాన్ని స్మరించడం, పచ్చని ప్రకృతిని చూడటం వల్ల రోజంతా సానుకూలతతో నిండిపోతుంది.