అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic fines | ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైన్ పడగానే బ్యాంక్ అకౌంట్ (bank account) నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యే వ్యవస్థ ఉండాలన్నారు.
హైదరాబాద్ నగరంలోని (Hyderabad City) యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో ‘అరైవ్ అలైవ్’ పేరిట రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. రోడ్డు భద్రతపై పోస్టర్, క్యాలెండర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో (Minister Ponnam Prabhakar) కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలన్నారు. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోవాలన్నారు. చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్‌గా డబ్బులు అకౌంట్ నుంచి కట్ అవ్వాలన్నారు. దీనికోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు.
Traffic fines | డిస్కౌంట్లు వద్దు
పోలీసులు ట్రాఫిక్ ఫైన్లు (traffic fines) వేస్తున్నారని, అయితే ఏడాదికి ఓ సారి డిస్కౌంట్లు ఇస్తున్నారని సీఎం అన్నారు. డిస్కౌంట్లు ఇవ్వద్దొని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, అతివేగంగా నడిపేవారిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
Traffic fines | బలోపేతం చేస్తాం
ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని సీఎం తెలిపారు. డీజీ, అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించేలా చర్యలు చేపడుతామన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని, మూడు నిమిషాలకు ఓ ప్రాణం పోతుందన్నారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.