HomeతెలంగాణArya Vaishya Sangham | ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి

Arya Vaishya Sangham | ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban Mla Dhanpal) అన్నారు.

మహాలక్ష్మి నగర్​లో (Mahalaxmi nagar)​ ఆదివారం వాసవి యువజన సంఘం (Vasavi Yuvajana Sangham) నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైశ్యులు అంటే సమాజంలో సేవకు మారుపేరుగా నిలుస్తారన్నారు. విద్యా, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో సేవలందించడంలో ముందుంటారని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదల గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ఎన్నికైన సభ్యులను అభినందించారు.

కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా, వాసవి యువజన సంఘం అధ్యక్షుడు అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు గుప్తా, కోశాధికారి రఘునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News