అక్షరటుడే,నిజామాబాద్ సిటీ : Nizamabad City | జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి (Nagesh Reddy), నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిరువురిని వారి స్వగృహాల్లో ఆర్యవైశ్య ప్రముఖులు సన్మానించారు. జిల్లా అభివృద్ధికి పార్టీ తరపున కృషి చేయాలని కోరారు. సన్మానించిన వారిలో ఆర్యవైశ్య ప్రముఖులు మోటూరి మురళి, బచ్చు పురుషోత్తం, మారప్రభు తదితరులు పాల్గొన్నారు.


