అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | ఆర్యవైశ్య సంఘానికి పునర్వైభవం వచ్చేలా ప్రతిఒక్కరూ సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో కిషన్ గంజ్‌లోని కార్యాలయంలో ఆత్మీయ స్నేహ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి అనుబంధ సంఘాలన్నీ సహకరించాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మరిచిపోయి ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇందూరు (Induru) ఆర్యవైశ్యులకు ప్రత్యేక స్థానం ఉండేదన్నారు. మళ్లీ ఆ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు సేవకు మారుపేరని తెలిపారు. పట్టణ సంఘంలో గెలిచిన వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కృషి చేయాలన్నారు.
Arya Vaishya Sangham | నగరాభివృద్ధికి కృషి చేస్తున్నా..
తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ప్రధానంగా తన నియోజకవర్గానికి సీడీపీ నిధులు (CDP funds) రావడంలేదని, వాటికోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరడం లేదని వాటికోసం పోరాడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, గాలి నాగరాజు, వీరమల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.