అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కళాకారుల పోరుదీక్ష పోస్టర్‌ను కామారెడ్డి (Kamareddy) కళాకారులు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరాపార్క్‌లో ఈనెల 20వ తేదీన దీక్ష జరుగనుందన్నారు.
Kamareddy | కళాకారులకు ఉద్యోగ సాధన కోసం..
ఉద్యమ కళాకారుల ఉద్యోగ సాధన కోసం ఈ పోరుదీక్ష చేపడుతున్నట్లు కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ దీక్షకు జిల్లాలోని కళాకారులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షుడు దేవరాజ్, గౌరవ అధ్యక్షుడు రెడ్డి రాజయ్య, కోశాధికారి రాజలింగం యాదవ్, శంకర్ గౌడ్, వడ్ల వెంకన్న, సలహాదారుడు కిషన్, శ్రీనివాస్, ఎల్లయ్య, శ్రీనివాస్, శ్యాం, స్వామి, స్వప్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.