అక్షరటుడే, బోధన్ : Bodhan Police | బంగారం దుకాణాల (Gold Shops) తాళాలు పగలగొట్టి సొత్తును దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒక సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) వివరాలు వెల్లడించారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital) ఎదురుగా ఉన్న బంగారం షాపులో డిసెంబర్ 21న చోరీ జరుగగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ సమాచారం, సీసీ పుటేజీ ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో సభ్యుడైన మమ్మద్ మూల సబ్ షేక్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి కిలో వెండి, 5 తులాల బంగారాన్ని రికవరీ చేశామని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ వెంకటనారాయణ (CI Venkatanarayana), టౌన్ ఎస్సై మనోజ్ కుమార్ (SI Manoj Kumar) , ఏఎస్సై బాబురావు తదితరులు పాల్గొన్నారు.