Panchayat Elections | ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Panchayat Elections | ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) బోధన్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై బోధన్​ సర్కిల్​కార్యాలయంలో సీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. Panchayat Elections | సమస్యాత్మక […]

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Panchayat Elections | ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) బోధన్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై బోధన్​ సర్కిల్​కార్యాలయంలో సీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

Panchayat Elections | సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి..

ప్రధానంగా బోధన్ డివిజన్ (Bodhan division) పరిధిలో సమస్యాత్మక, అతిసమస్మాత్మకమైన పోలింగ్​స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించడాన్ని నివారించాలన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు.

Panchayat Elections | చెక్​పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు..

ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతర అక్రమ రవాణా జరగడానికి వీల్లేకుండా అంతర్రాష్ట, అంతర్​జిల్లా సరిహద్దు చెక్​పోస్టులను మరింత పటిష్టం చేయాలని సూచించారు. విలేజ్ పోలీస్​ అధికారులు (Village Police Officers) ఆయా గ్రామాలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషిచేయాలని సూచించారు.

Panchayat Elections | ప్రలోభాలకు లొంగిపోవద్దు..

సిబ్బంది ఎన్నికల రోజు తెల్లవారుజామునే తమ పోలింగ్ బూత్​లో (polling booths) విధులకు హాజరవ్వాలని సీపీ సూచించారు. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో బోధన్​ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్​బాబు, బోధన్ ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ, నిజామాబాద్ నార్త్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునీల్, వర్ని ఎస్సై ఎస్.రాజు, రుద్రూర్ ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...