Homeతాజావార్తలుGlobal Summit | గ్లోబల్​ సమ్మిట్​కు ముమ్మరంగా ఏర్పాట్లు.. పాల్గొననున్న సెలబ్రిటీలు

Global Summit | గ్లోబల్​ సమ్మిట్​కు ముమ్మరంగా ఏర్పాట్లు.. పాల్గొననున్న సెలబ్రిటీలు

హైదరాబాద్​ నగరంలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్​కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Global Summit | భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్‌ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ (Telangana Rising Global Summit) కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు.

గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, టూరిజం, పరిశ్రమలు, గిగ్ ఎకానమీ, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వ్యవసాయం, సామాజిక సంక్షేమం వంటి రంగాలపై చర్చించనున్నారు.

Global Summit | పాల్గొననున్న ప్రముఖులు

ఈ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలువురికి ఆహ్వానం అందించింది. సీఎం స్వయంగా ప్రధాని మోదీని (Prime Minister Modi) ఆహ్వానించారు. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్​, వరల్డ్ బ్యాంక్​, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు పలు సంస్థలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. క్రీడారంగానికి చెందిన పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెషన్‌లో పాల్గొంటారు. సినీ ప్రముఖులు రాజమౌళి, సుకుమార్, రితేష్ దేశ్‌ముఖ్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి వారు సైతం చర్చలకు హాజరు అవుతారు.

Global Summit | నిత్యం సీఎం సమీక్ష

దావోస్​లో ప్రతి ఏటా వరల్డ్ ఎకనామిక్​ ఫోరమ్ సదస్సు (World Economic Forum conference) జరుగుతుంది. దానిని తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్​ సమ్మిట్​ నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) యోచిస్తున్నారు. ఈ మేరకు నిత్యం అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ సమ్మిట్​లో డిసెంబర్​ 9న తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యమెం​ట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది.

Must Read
Related News