Telangana University | తెయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించే రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి (Graduation ceremony) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వర్సిటీ వీసీ యాదగిరి రావు (University VC Yadagiri Rao) తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం వర్సిటీ ఆవరణలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. Telangana University | తనిఖీలను పర్యవేక్షించిన సీపీ స్నాతకోత్సవానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, ఆయా యూనివర్సిటీల డీన్లు వస్తుండడంతో […]

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించే రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి (Graduation ceremony) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వర్సిటీ వీసీ యాదగిరి రావు (University VC Yadagiri Rao) తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం వర్సిటీ ఆవరణలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.

Telangana University | తనిఖీలను పర్యవేక్షించిన సీపీ

స్నాతకోత్సవానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, ఆయా యూనివర్సిటీల డీన్లు వస్తుండడంతో ప్రాంగణాన్ని స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం (Sniffer Dog Squad), బాంబు డిస్పోజల్ టీం(Bomb disposal team) అధికారులు నిషితంగా పరిశీలించారు. తనిఖీలను సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పర్యవేక్షించారు. అనంతరం ఏడో బెటాలియన్​ (Seventh Battalion) గాడ్​ ఆఫ్​ ఆనర్​ టీం, బ్యాండ్​ టీం ఆర్​ఎస్​ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్​లర్​ యాదగిరిరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

Telangana University | మాక్​డ్రిల్​ పూర్తి..

వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్​తో కలిసి మాక్​ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ కమిటీల కన్వీనర్లు గంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, హారతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల నాగరాజు, పీఆర్వో పున్నయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...