panchayat elections | రెండో విడత నామినేషన్లను ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

అక్షరటుడే, కామారెడ్డి: panchayat elections | గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో కామారెడ్డి డివిజన్​లోని పది మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను శనివారం సాయంత్రం వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడతగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు. ఎల్లారెడ్డి డివిజన్​లోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, […]

అక్షరటుడే, కామారెడ్డి: panchayat elections | గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో కామారెడ్డి డివిజన్​లోని పది మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను శనివారం సాయంత్రం వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడతగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు.

ఎల్లారెడ్డి డివిజన్​లోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, లింగంపేట్, బాన్సువాడ డివిజన్లోని పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్​ నగర్ మండలాలు ఏడు మండలాల పరిధిలోని 197 సర్పంచ్ స్థానాలకు, 1654 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో నామపత్రాలు దాఖలు చేయవచ్చని తెలిపారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్​లు అందుబాటులో ఉంచామన్నారు. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...