అక్షరటుడే, ఆర్మూర్: Science Exhibition | రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు (state-level science exhibition) ఆర్మూర్ విద్యార్థులు ఎంపికయ్యారు. బోధన్‌లోని విజయ మేరీ హైస్కూల్లో (Vijaya Mary High School) ఈ నెల 24 నుంచి 25వరకు నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మూర్ శ్రీ చంద్ర హైస్కూల్ (Sri Chandra High School) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన్నట్లు పాఠశాల ఛైర్మన్ పోల్కం శేఖర్ తెలిపారు.
పోటీల్లో పాఠశాల విద్యార్థులు వీక్షిత (8వ తరగతి), జి.మధురిమ (7వ తరగతి) ‘గ్రీన్ ఎనర్జీ’ థీమ్‌పై ‘మేము హరిత శక్తిని సృష్టించి దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చుతాము” అనే శీర్షికతో ప్రాజెక్టును ప్రదర్శించి స్టేట్ లెవెల్ పోటికి ఎంపిక అయిందన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను కరస్పాడెంట్ పోల్కం నారాయణ, వైస్ ఛైర్మన్ పోల్కం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ చాట్ల రవి, గైడ్ టీచర్ నిఖిత, ఉపాధ్యాయులు అభినందించారు.