115
అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Municipality | ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణి (Municipal Commissioner Shravani) విడుదల చేశారు.
Armoor Municipality | ప్రజల సందర్శనార్థం..
ఈ జాబితాను ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం (Sub Collector Office), తహశీల్దార్ కార్యాలయాల్లో సందర్శనార్థం ప్రదర్శిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలు ఆయా కార్యాలయాలను సందర్శించి తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పౌరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.