అక్షరటుడే, గాంధారి: Boxing competitions | మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి అర్జున్ గజానంద్ దేశ్‌ముఖ్ జాతీయ బాక్సింగ్ పోటీల్లో (national boxing competitions) ప్రతిభ చూపి వెండి పతకం సాధించాడు. ఈ మేరకు జడ్పీటీసీ తానాజీ రావు, వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్ వివరాలు వెల్లడించారు.
జాతీయ బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలోని అలీపూర్‌లో ఎస్ఎం బాక్సింగ్ క్లబ్లో (SM Boxing Club) జాతీయస్థాయి పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో ఫస్టియర్ చదువుతున్న అర్జున్ గజానంద్ దేశ్‌ముఖ్ 65 కిలోల విభాగంలో మెడల్ సాధించాడన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ జాతీయస్థాయి యూత్ పోటీలు (National Level Youth Competitions) నవంబర్ 21 నుంచి 24 వరకు జరిగాయని ఫైనల్లో ఉత్తరాఖండ్ (Uttarakhand) క్రీడాకారులతో పోటీపడి ద్వితీయ సాధించాడని తెలిపారు.
హైదరాబాద్‌లోని (Hyderabad) బంజారాహిల్స్‌లో అర్చన బాక్సింగ్ క్లబ్ కోచ్ సంతోష్ ఆధ్వర్యంలో అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం తేవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాడని తెలిపారు. జాతీయస్థాయిలో పథకం సాధించిన అర్జున్‌కు కళాశాల అధ్యాపక బృందం, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
