CP Sai Chaitanya
CP Sai Chaitanya | దసరాకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోండి : పోలీస్ కమిషనర్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | దసరా పండుగ సందర్భంగా సెలవుల్లో(Dussehra Holidays) ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిత్యం ఇళ్లకు వచ్చివెళ్లేవారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు.

CP Sai Chaitanya | అనుమానం వస్తే.. ప్రశ్నించాలి..

కాలనీల్లో రాత్రివేళ్లలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగివే వెంటనే వారిని ప్రశ్నించాలని సీపీ సూచించారు. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతారని పేర్కొన్నారు. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తే ఇంటిపక్కవాళ్లకు సమాచారం ఇవ్వాలని..వారిని ఓ కంట కనిపెట్టి ఉండేలా చూడమని చెప్పాలని వివరించారు. పక్కింటివాళ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండాలని పేర్కొన్నారు.

CP Sai Chaitanya | అపరిచితులతో జాగ్రత్త..

ఉద్యోగరీత్యా బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో వృద్ధులు మహిళలు ఉంటే.. వారు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా డోర్లు ఎప్పుడూ మూసి ఉంచాలని.. తెలియని వాళ్లను ఇంట్లోకి రానివ్వొద్దని స్పష్టం చేశారు. ఊళ్లకు వెళ్లినప్పడు ఖరీదైన వస్తువులను(Expensive Items) ఇంట్లో ఉంచవద్దని సీపీ వివరించారు. బ్యాంక్​ లాకర్లలో ఉంచితే బాగుంటుందన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే సమయంలో సమీప పోలీస్​స్టేషన్​లో సమాచారం అందించాలని సూచించారు. పోలీస్​శాఖ(Police Department)కు అనుమానిత వ్యక్తుల సమాచారం అందించి చోరీల నివారణకు సహకరించాలని సూచించారు.