ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

    Nizamabad | ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నిజామాబాద్​ నగరపాలక సంస్థతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతన్నారు. ప్రత్యేకించి పలువురు కమర్షియల్ భవనాల యజమానులు (building owners) నిబంధనలు పాటించడం లేదు. తీసుకున్న అనుమతులకు మించి అంతస్తులు కడుతున్నారు. అంతేగాకుండా పార్కింగ్ స్థలం వదలకుండా (parking place), సెట్​ బ్యాక్​ లేకుండానే భవనాలు నిర్మిస్తున్నారు.

    జిల్లాలో నిజామాబాద్​ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్ (Armoor muncipality)​, భీమ్​గల్ (bheemgal muncipality)​, బోధన్​ మున్సిపాలిటీలు (Bodhan municipality) ఉన్నాయి. ఆయా బల్దియాల పరిధిలో జోరుగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు విస్తరిస్తున్నాయి. దీంతో నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. అయితే నివాస, వాణిజ్య నిర్మాణాల సమయంలో కొందరు నిబంధనలు పాటించడం లేదు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు.

    READ ALSO  Nizamabad City | అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

    Nizamabad city | అనుమతికి మించి..

    ఇళ్ల నిర్మాణం చేపట్టే ముందు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్నా.. వాస్తవ నిర్మాణానికి ఎంతో తేడా ఉంటుంది. నిజామాబాద్ నగరపాలక సంస్థ (Nizamabad Municipal Corporation) పరిధిలో కమర్షియల్ భవనాల నిర్మాణానికి సంబంధించి ఎక్కడ చూసినా నిబంధనల ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. కొందరు జీ+1, జీ+2 భవనాలకు అనుమతి తీసుకొని మూడు నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండానే పాత ఇళ్ల స్థలంలో భవనాలు కడుతున్నారు. ప్రత్యేకించి ఆస్పత్రులకు మారుపేరుగా ఉన్న ఖలీల్ వాడిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

    Nizamabad city | సెట్​బ్యాక్​ లేకుండానే..

    భవనాలు నిర్మించే సమయంలో తప్పనిసరిగా నలుదిక్కులా ఖాళీ స్థలం వదలాలి. కానీ కొందరు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే భవనాలు నిర్మిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. తప్పనిసరిగా ఖాళీ స్థలం వదిలేయాల్సి ఉంటుంది. అయినా హైదరాబాద్ రోడ్డు, ఖలీల్​వాడి, ప్రగతినగర్ లాంటి ప్రదేశాల్లో కనీసం పార్కింగ్ స్థలం కూడా వదలకుండా భారీ భవంతులు నిర్మిస్తున్నారు.

    READ ALSO  Nizamabad City | సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసీపీ

    Nizamabad city | నోటీసులకే పరిమితం

    నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వాటి విషయంలో అధికారులు (muncipal officers) పట్టించుకోవడం లేదు. ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారికి అధికారులే దగ్గరుండి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆయా మున్సిపాలిటీల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this