అక్షరటుడే, వెబ్‌డెస్క్: AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశాలు తగ్గడంపై ఆయన మాట్లాడారు.
బాలీవుడ్‌లో (Bollywood) అవకాశాలు తగ్గడంపై మాట్లాడుతూ.. మతం కూడా ఓ కారణం అయుండొచ్చని అన్నారు. క్రియేటివిటీ లేని వారు వస్తున్నారని ఆయన అన్నారు. అయితే మతం కారణంగా తనకు అవకాశాలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ నటులతో పాటు నెటిజన్లు రెహమాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
AR Rahman | భారత్ నాకు స్ఫూర్తి
తన వ్యాఖ్యలు వక్రీకరించారని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ (Music director Rahman) అన్నారు. భారత్ తనకు స్ఫూర్తి అంటూ వీడియో రిలీజ్ చేశారు. భారత్ తనకు ఇళ్లు, గురువు అని పేర్కొన్నారు. సంగీతానికి గౌరవం తగ్గడమే తన వ్యాఖ్యల అర్థమని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదని తెలిపారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. భారతీయుడిగా తానెంతో గర్వపడతానని.. సంగీతానికి సేవ చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
AR Rahman | ఏమన్నారంటే..
బీబీసీ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. గత ఎనిమిదేళ్లుగా మారిన అధికార సమీకరణాలు, మతపరమైన విషయం కారణంగా తనకు అవకాశాలు రావడం లేదన్నారు. సృజనాత్మకత లేని వ్యక్తులు ఇప్పుడు విషయాలను నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు మైనారిటీ నటులు స్పందించారు. తామెప్పుడు అలాంటి వివక్ష ఎదుర్కోలేదన్నారు. రెహమాన్ వ్యాఖ్యలను ఖండించారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. తనకు ఎప్పుడూ ఇలా అనిపించలేదన్నారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.