అక్షరటుడే, వెబ్‌డెస్క్: Common Entrance Tests | తెలంగాణలో వివిధ రకాల ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కన్వీనర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీటెక్, బీఈ, బీఫార్మసీ ప్రవేశాల కోసం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈఏపీసెట్ (EAPCET) నిర్వహిస్తారు. దీని కన్వీనర్‌గా జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ విజయ కుమార్ రెడ్డి నియమితులయ్యారు.
Common Entrance Tests | ఎడ్‌సెట్ కోసం..
బీఈడీ ప్రవేశాల కోసం టీజీ ఎడ్‌సెట్ పరీక్షను (TG EdCET examination) కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డిని నియమించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల (MBA and MCA admissions) కోసం ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. నల్గొండ మహత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్ష కన్వీనర్‌గా అలువల రవిని ప్రభుత్వం ఎంపిక చేసింది. పాలిటెక్నిక్ తర్వాత బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం ఓయూ ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్వహించనున్నారు. దీనికి ప్రొఫెసర్ చంద్రశేఖర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. లాసెట్, పీసీ లాసెట్ పరీక్షలకు ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి, పీజీఈసెట్‌కు జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ వెంకటరేశ్వరరావు, పీఈ సెట్‌కు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్‌ను కన్వీనర్లు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.