అక్షరటుడే, వెబ్డెస్క్ :New Bars | రాష్ట్రంలో మరిన్ని బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం(Government) సన్నాహాలు చేపట్టింది. కొత్తగా 28 బార్ల ఏర్పాటుకు new bars application telangana దరఖాస్తులు ఆహ్వానించింది.
ఆదాయం లేక తీవ్రంగా సతమతమవుతున్న ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ(Excise Department) ద్వారా ఎంతో కొంత ఆదాయం పెంచేందుకు ఈ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు ఎక్సైజ్ శాఖ తిరిగి అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ ఏర్పాటుకు దరఖాస్తులు ఎక్సైజ్ శాఖ ఆహ్వానించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటికే విపరీతమైన విక్రయాలు కొనసాగుతున్న తరుణంలో కొత్త బార్ల(New Bars) ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడం గమనార్హం.
New Bars | దరఖాస్తులకు గడువు జూన్ 6
రాష్ట్ర వ్యాప్తంగా 28 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం గురువారం నుంచే అప్లికేషన్లను స్వీకరించనుంది. జూన్ జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లక్కీ డ్రా(Lucky Draw) ద్వారా బార్‌ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల వారు స్థానిక ఎక్సైజ్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
New Bars | సొమ్ముల కోసం..
ఆదాయం లేక రాష్ట్ర ప్రభుత్వం(State Government) సతమతమవుతోంది. ఖర్చులకు, ఆదాయానికి ఏమాత్రం పొంతన ఉండడం లేదు. వేతనాలు, సంక్షేమ పథకాల అమలుకు కలిపి ప్రతి నెలా రూ.22 వేల కోట్ల దాకా వ్యయమవుతుండగా, ఆదాయం రూ.18,500 కోట్లకు మించడం లేదు. ప్రతి నెలా సుమారు రూ.4 వేల రెవెన్యూ లోటుతో ఖజానా ఖునారిల్లుతోంది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖల నుంచే ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరేది.
అయితే, రియల్ ఎస్టేట్ నేలచూపులు చూస్తున్న తరుణంలో అటు రెవెన్యూ శాఖకు, ఇటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయం పడిపోయింది. ఎక్సైజ్ శాఖ(Excise Department) మాత్రమే సర్కారుకు కాసులు కురిపిస్తోంది. ఈ తరుణంలో మద్యం విక్రయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. 28 కొత్త బార్ల మంజూరుకు అనుమతించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government).. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది.