5
అక్షరటుడే, ఇందూరు: Job alerts | జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్(Manager), అసిస్టెంట్ మేనేజర్ పోస్టు(Assistant Manager Post)లకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జనరల్ మేనేజర్ కె సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఈడీసీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్ట్(Contract) పద్ధతిలో కేటాయించారని పేర్కొన్నారు. మే10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు www.nimsme.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. అలాగే 9640909831 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.