Homeజిల్లాలునిజామాబాద్​Scholarships | ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించాలి

Scholarships | ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించాలి

ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సంక్షేమశాఖ జిల్లా అధికారులు, ఎంఈవోలతో జూమ్ మీటింగ్​ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Scholarships | ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు సకాలంలో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. సంక్షేమశాఖ (Welfare Department) జిల్లా అధికారులు, ఎంఈవోలతో శుక్రవారం జూమ్ మీటింగ్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్,​ ఎయిడెడ్ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్​షిప్​ (scholarships) కోసం దరఖాస్తు చేయించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థితో ఈనెల చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. వారం తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని.. స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News