HomeతెలంగాణBar License | బార్లకు దరఖాస్తుల వెల్లువ.. ఎక్సైజ్​ శాఖకు భారీగా ఆదాయం

Bar License | బార్లకు దరఖాస్తుల వెల్లువ.. ఎక్సైజ్​ శాఖకు భారీగా ఆదాయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bar License | రాష్ట్రంలోని పలు బార్లకు ఇటీవల ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో చాలా మంది లైసెన్స్​ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని 24 బార్లు, ఇతర జిల్లాల్లో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా విశేష స్పందన వచ్చింది.

మొత్తం 28 బార్ల టెండర్‌ కోసం 3,668 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 24 బార్లకు 3,520 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి.

మహబూబ్‌నగర్‌లోని బార్‌కు 49, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ జల్‌పల్లి మున్సిపాలిటీలోని బార్‌కు 57, నిజామాబాద్ జిల్లా బోధన్‌ (Bodhan)లోని బార్‌కు 15 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఆయా బార్ల కోసం ఈ నెల 13న డ్రా పద్ధతిలో దరఖాస్తుదారులను ఎంపిక చేయనున్నారు.

Must Read
Related News