అక్షరటుడే, బిచ్కుంద: మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025- 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. న్యాక్ ఏ గ్రేడ్, అటానమస్ హోదా కలిగిన కళాశాలలో అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, అత్యున్నత ప్రమాణాలతో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివరాలకు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524)ను సంప్రదించాలన్నారు.
Home జిల్లాలు కామారెడ్డి Bichkunda Government Degree College| ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం