అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apple smartphone | అగ్రస్థానంలో ఉన్న శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆపిల్ వెనక్కి నెట్టింది. ఐఫోన్ 17 అమ్మకాలతో ఆపిల్ అగ్రస్థానంలో నిలబడింది. గత 14 ఏళ్లలో ఫస్ట్ టైం నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్థానం నుంచి శామ్‌సంగ్ Samsung వెనక్కి వెళ్లింది. ఆపిల్ మొదటి స్థానంలో నిలిచినట్లు సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ పనితీరు, ఐఫోన్ 16 విజయంగా అమ్మకాలతో ఈ ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Apple smartphone | రెండో స్థానానికి పరిమితం..
ఐఫోన్ 17 సిరీస్‌కు అత్యధిక డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 2025లో శామ్‌సంగ్‌ను ఆపిల్ కంపెనీ అధిగమించి వరల్డ్‌లోనే మొదటి శ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. కొరియన్ కంపెనీ శామ్‌సంగ్‌ను 14 సంవత్సరాలలో మొదటిసారి అమెరికన్ ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ ఫోన్లు ఎక్కువగా విక్రయాలు నమోదు చేసుకోవడం ఇదే ప్రథమం.
యాపిల్ విజృంభనతో శాంసంగ్ రెండో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. యాపిల్ 20 శాతం, శామ్‌సంగ్ 19 శాతం, షియోమీ 13 శాతం, వివో 8 శాతం, ఒప్పో 8 శాతం, ఇతర బ్రాండ్ల కంపెనీలు 32 శాతం వాటాతో కొనసాగుతున్నాయి.