అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Rajya Sabha candidate : ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారైంది. ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ భాజపా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ కు మొత్తానికి తెరపడింది.
రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు మంగళవారం(ఏప్రిల్ 29) మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పాక వెంకట సత్యనారాయణ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 1996లో వెంకట సత్యనారాయణ నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు.