HomeUncategorizedAP Mega DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

AP Mega DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

- Advertisement -

అక్షరటుడే, అమరావతి : AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్​లో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను సర్కారు విడుదల చేసింది. ఈ డీఎస్సీ ఫలితాలను ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) విద్యాశాఖ అధికారిక వెబ్​సైట్​లో చూడొచ్చు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం ఏపీ సర్కారు మెగా డీఎస్సీ నిర్వహించింది. దీని ఫలితాలను తాజాగా విడుదల చేసింది.

AP Mega DSC Results : ఇచ్చిన హామీ మేరకు..

తాము అధికారంలోకి వస్తే భారీగా టీచర్​ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ (AP Mega DSC) ప్రకటించింది. ఆయా పోస్టులకు మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్​ విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఇక తాజాగా ఫలితాలను కూడా ప్రకటించింది.