అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tecno Spark Go 3 | టెక్నో నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ (Smart Phone) వస్తోంది. టెక్నో స్పార్క్ గో 3 పేరుతో ఈనెల 16న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. బేస్ వేరియంట్ ధర రూ. 8 వేలలోపు ఉండొచ్చని తెలుస్తోంది.
అమెజాన్ (Amazon)తో పాటు టెక్నో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.
డిస్‌ప్లే : 6.74 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 * 1600 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ : Unisoc T7250 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్‌అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 15డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌తో అందుబాటులో ఉండనుంది. ధర రూ. 7,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.