అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrendered | ఆపరేషన్ కగార్(Operation Kagar)తో ఇప్పటికే కుదేలైన మావోయిస్టులను లొంగుబాట్లు కలవరపెడుతున్నాయి. దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాకాలంలో సైతం మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు వేల సంఖ్యలో బలగాలు ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్లు చోటుచేసుకొని పలువురు మావోయిస్టులు మృతి చెందారు. కీలక నేతలను సైతం కోల్పోతుండడంతో మావోలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆపరేషన్ కగార్ ఆపేది లేదని తేల్చి చెప్పింది. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని.. ఆయుధాలు వీడి లొంగిపోవాలని అమిత్‌షా గతంలో సూచించారు. ఈ క్రమంలో తాజాగా 22 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా ఎస్పీ(Narayanpur District SP) శుక్రవారం మావోలు లొంగిపోయారు(Maoists Surrendered). వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోలపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఇటీవల వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. గత మే నెలలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ (SP Rohitraj Raj) ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోగా.. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఎదుట మరో 20 మంది లొంగిపోయారు.